పిఠాపురం :కాకినాడ జిల్లా పిఠాపురం గవర్నమెంట్ పొలిటెక్నిక్ కాలేజీ స్కిల్ హబ్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి సహకారంతో స్టార్ట్ యువర్ బిజినెస్ (ఎస్.వై.బి) ఫై ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యభివృద్ధి సంస్థ అధికారి, డి. హరి శేషు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషణ్ సంయుక్తంగా వారి ద్వారా శిక్షణ అమలు చేస్తున్నామని తెలిపారు. వ్యాపార నిర్వహణ శక్తి సామర్థ్యాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఎదగడానికి కావలసినటువంటి మెళకువలు, వ్యాపారం చేసుకొనుటకు కావలసిన విధి విధానాలు అనే అంశంపై శిక్షణ, వ్యాపార అభివృద్ధిలో మార్కెటింగ్, కొనుగోలు, స్టాక్ నియంత్రణ, ఖాతా పుస్తకాలు నిర్వహణ, వ్యాపార ప్రణాళిక, ఉత్పాదక అంశాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ ఇస్తామన్నారు.
జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి. హరి శేషు, ప్లేస్మెంట్ అధికారి శ్యామ్, కో ఆర్డినేటర్ రేవతి,
ఐఎల్ఓ ట్రైనర్స్ తరుణ్ కుమార్, హేమాద్రి మరియు గవర్నమెంట్ పొలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ సంజీవరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

