
రామచంద్రపురం :రామచంద్రపురం మండలంలోని సి రామాపురం, కుప్పం బాదూరు, పులమనాయుడు కండ్రిగ, సి. కాలే పల్లి యూనిట్ల పరిధిలోగల పలు గ్రామాలలో యూకే నుంచి బర్నింగ్ హేమ్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ ఫారెన్స సర్జన్, బీహార్ నుంచి ప్రొఫెసర్ నిశాంత్ సింగ్, వెస్ట్ బెంగాల్ నుంచి ప్రొఫెసర్ రే తిరుపతి జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ డిపిఎం షణ్ముగం తో పాటు కలిసి ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సాగు చేస్తున్న పంటలను విదేశీ, వివిధ రాష్ట్రాల బృందం సందర్శించారు ఇందులో భాగంగానే ఏటీఎం, ఏ గ్రేడ్, సూర్య మండలం, పీ ఎం డి ఎస్ ,పెరటి తోటలు తోపాటు వరి పంటలను సందర్శించి, పంటలు సాగు చేయు విధానం పెట్టుబడులు పంట దిగుబడిపై పలువురు రైతుల నుంచి అడిగి తెలుసుకున్నారు. సి కాలే పల్లెలో రైతులు స్వయం సహాయక సంఘ సభ్యులు, ప్రకృతి వ్యవసాయ శాఖ మండల అన్ని క్యాడర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిపిఎం షణ్ముగం మాట్లాడుతూ ఏపీ సీఎన్ఎఫ్, ఆర్ వై ఎస్ ఎస్ ప్రాజెక్టు ద్వారా మండలంలో జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాన్ని సందర్శించి వారి రాష్ట్రాల్లో అమలుపరిచేందుకు రావడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ డిపిఎం పట్టాభి రెడ్డి, స్టేట్ సీనియర్ టి యల్ చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర సీనియర్ కన్సల్టెంట్ సురేంద్ర రెడ్డి, కార్యాలయ సిబ్బంది, ఎంటీలు, యూనిట్ ఇన్చార్జులు, ఐ సి ఆర్ పి లు రైతులు పాల్గొన్నారు

