సహజనటిగా తెలుగులో పేరు తెచ్చుకున్న సాయి పల్లవి లేడి పవర్ స్టార్ గా కూడా సౌత్ లో మంచి ఇమేజ్ సంపాదించింది. ఈమె సినిమాలో నటిస్తుంది అంటే చాలు ఆ సినిమా హిట్ అయిన ప్లాప్ అయినా ఆ మూవీలోని సాయి పల్లవి పాత్రని చాలామంది గుర్తుంచుకుంటారు. అలా సాంప్రదాయమైన పాత్రల్లో నటిస్తూ సాయి పల్లవి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక సాయి పల్లవి అభినయానికి,అందానికి చాలామంది స్టార్ హీరోలు కూడా ఆమెకు అభిమానులుగా మారిపోయారు. అయితే అభిమానులకు సాంప్రదాయమైన హీరోయిన్ గా గుర్తిండి పోయిన సాయి పల్లవి మొదటిసారి అలాంటి పాటలో నటించ బోతుందట.. ఇక ఆ పాట ఏదో కాదు రొమాంటిక్ సాంగ్అ వును మీరు వినేది నిజమే.. కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం సాయి పల్లవి శివ కార్తికేయన్ తో కలిసి నటించబోయే సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ ఆ హీరో తో చేయబోతుందట. స్టార్ హీరో కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందిస్తున్న తాజా మూవీ అమరన్ ఈ మూవీలో శివ కార్తికేయన్ ఒక సైనికుడు పాత్రలో నటించబోతున్నారట.