మేడారం సమ్మక్క సారలమ్మ వార్ల హుండీ ఆదాయం తొలిరోజు రూ.3.15 కోట్లుగా ఉంది. మేడారం మహాజాతర హుండీ లెక్కింపు గురువారం నాడు ప్రారంభమైంది. మొత్తం 518 హుండీలను లెక్కించనున్నారు. ఇందులో భాగంగా నేడు మొదటి రోజు 134 హుండీలను దేవాదాయ శాఖ అధికారులు లెక్కించగా మూడు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. ఈ మొత్తాన్ని అధికారులు బ్యాంకులో జమ చేస్తారు.