ప్రతి ఏటా గోదావరి వరదలు వల్ల ఆలస్యం అవుతున్న ఖరీఫ్ సీజన్
ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్న ఏరువాక పనులు.
అలాగే ముమ్మరంగా సాగుతున్న వరినాట్లు పనులు.
వి.ఆర్.పురం

వానాకాలం పంట సీజన్కు అన్నదాతలు శ్రీకారం చుడుతున్నారు, నైరుతి రుతుపవనాలు చురుగ్గా ప్రవేశించడంతో మండలంలోని రైతాంగం ప్రారంభం కాగా రైతులు దుక్కులు దున్నడం, చదును చేయడం ప్రారంభించారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది, అందుకే వరదలు సంభవించి లోతట్టు గ్రామాల్లోని వందలాది పంట పొలాలు వరద నీటిలో మునిగాయి. ఈ ఏడాది నైరుత రుతుపవనాలు సకాలంలో రావడంతో అన్నదాతలు వ్యవసాయ పనులపై దృష్టి సారించి పొలాలను దున్ని పత్తి, మొక్కజొన్న ఇతర విత్తనాలను వేసేందుకు సన్నద్ధమయ్యారు. కానీ ఇంతలో వర్షాలు అధికంగా పడటం, వరదలు సంభవించటంతో ఈ ఏడాది వరి, అపరాల పంటలు వేయటానికి ఆలస్యం అయ్యింది. ప్రతి ఏటా గోదావరి శబరి జీవనదులు పరివాహంలోని లోతట్టు గ్రామాల పంట పొలాలను, వరదలు తగ్గిన తర్వాత రైతులు వ్యవసాయ పనులను మొదలు పెడతారు. ప్రతి ఏటా జూన్, జూలై, ఆగస్టు నేలలను చూసి, రైతులు వ్యవసాయ పనులపై నిమగ్నమవుతారు. ఈఏడాది ఆగస్టు నెల చివరి రోజుల్లో వర్షాలు తగ్గి, గోదావరి వరదలు కూడా పూర్తిగా తగ్గటంతో మండలంలోని గిరిజన రైతులు తమ పొలాలను, దుక్కిటేద్దులతో దున్నుకొంటు ఏరువాక సాగుతున్నారు. మండలంలోని గోదావరి లోతట్టు గ్రామాలలోని పంట పొలాలను దున్నుకొంటూ పొలాలను రైతులు సిద్దంచేస్తున్నారు.
** మండలంలో మొదలైన వరినాట్లు

ఈ ఏడాది జూన్ ప్రారంభం నుంచే విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు ముందుగానే వరినారుమడులు సిద్ధం చేసుకుని వరినాట్లు వేసేందుకు సన్నద్ధ మయ్యారు. ఈసంవత్సరం నైరుతి రుతుపవనాలు వల్ల విస్తారంగా వర్షాలు కురవటంతో మండలంలోని వాగులు, వంకలు, చెరువులు, కుంటలన్నీ నీరుచేరి కళ కళలాడు తున్నాయి. దీంతో రైతాంగం ఈ ఏడాది వరిసాగు బాగానే ఉంటుందన్న ఆశా భావం వ్యక్తం చేస్తూ వరినాట్లువేసే పనిలో నిమగ్నమయ్యారు. సాధారణంగా మండలంలో గోదావరి ముంపు లేని గ్రామాల్లో వరినాట్లు జూలైలో వేస్తారు. ముంపు ప్రాంత వాసులైతే ఆగస్టు నెలాఖరు నుంచి సెప్టెంబర్ నెలా ఖరులోపు నాట్లు వేస్తారు. ఈ ఏడాది ఆశించిన మేర వర్షాలు పడటంతో రైతులు అధిక విస్తీర్ణంలో వరి సాగుకు ఉపక్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కూలీల కొరత ఏర్పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. మొత్తం మీద మరో పది పది హేను రోజుల్లో వరినాట్లు కార్యక్రమం. ముగియవచ్చని రైతులు అభిప్రాయప డుతున్నారు. మండలంలో పలుచోట్ల వరినాట్లు వేస్తుండగా కొన్ని చోట్ల ఎద్దుల నాగళ్లు, ట్రాక్టర్లుతో పొలం దమ్ములు చేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు.
