లేపాక్షి: లేపాక్షి మండల పరిధిలోని నాయన పల్లి గ్రామానికి చెందిన మాజీ జడ్పిటిసి ఆర్ జి ఆదినారాయణ రెడ్డి మృతి తెలుగుదేశం పార్టీకి తీరనిలోటని హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేత అంబికా లక్ష్మీనారాయణ, నాగరాజు ,టిడిపి మండల కన్వీనర్ ఈడిగ జయప్ప పేర్కొన్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడు ఆదినారాయణ రెడ్డికి భార్య ,ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావము నుండి పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేశారు. ఇతనికి స్వర్గీయ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తో ను, స్వర్గీయ హిందూపురం శాసనసభ్యులు నందమూరి హరికృష్ణతోనూ, ప్రస్తుత శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ తోను సుహృద్భావ అనుబంధం ఉంది. నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను కల్లూరు సర్పంచ్ గా ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. దీంతో అటు తెలుగుదేశం పార్టీతో పాటు ఇటు స్థానిక నాయకుల్లో చక్కటి అనుబంధం ఏర్పడింది. 1989 రండి 94 వరకు సర్పంచ్ గా పంచాయతీ అభివృద్ధికి విశేష కృషి చేయడం జరిగింది. అనంతరం కొంత కాలం పాటు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గా పనిచేశారు. అనంతరం 2014 నుండి 2019 వరకు జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులుగా ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలం పాటు హిందూపురం మార్కెట్ యార్డ్ డైరెక్టర్గా పనిచేశారు. ఈ విధంగా ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి చనిపోయేటంతవరకు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేసినట్లు వారు పేర్కొన్నారు. అతని అంత్యక్రియల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు నాగలింగారెడ్డి ,మారుతి ప్రసాద్, చంద్రశేఖర గౌడ్, సదాశివరెడ్డి, రవి, వెంకటేష్, సడ్లపల్లి అశ్వర్ధ నారాయణ లతో వందలాదిమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.