పాత సంప్రదాయం కొనసాగింపు
దిశగా చంద్రన్న అడుగులు…
ఆంధ్రాను అన్నపూర్ణాంధ్రగా మార్చేందుకు ముందుకు..
జీవనాడీకి పునర్జీవం పోసేందుకు పరుగులు…
ప్రజాపాలనపై పూర్తి బాధ్యతతో… ఆగిన ప్రాజెక్టు ఆవిరి పోసేందుకు అడుగుపెడుతున్న వైనం
ఆంధ్రుల కళను సాకారం చేసేందుకు అన్ని చర్యలు..
నేడు పోలవరంకు చంద్రన్న పయనం…
(రామమోహన్ రెడ్డి,సంపాదకులు)
ఇంతటి బృహత్తర ప్రాజెక్ట్ ఐదు సంవత్సరాలు గా అధోగతి చెందింది. నవ్యాంధ్రప్రదేశ్ లో సిరులు కురిపించే ఓకే ఒక్క ప్రాజెక్ట్ ఈ పొలవరమే. గోదావరమ్మను కృష్ణమ్మ ఒడిలో చేర్చి గ్రుక్కెడు నీరు లేక ఆవేదనతో తల్లడిల్లే రాయలసీమ ప్రాంత ప్రజానీకానికి ఊరట కల్పించే కల్పతరువు.రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేసే ప్రత్యేక వనరులలో అతి ముఖ్యమైన పోలవరం ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు.ఎన్నో ప్రభు త్వాలు మారాయి..ఎందరో ముఖ్యమంత్రులు మారిన ప్రాజెక్ట్ ముఖచిత్రాన్ని మార్చింది నాటి నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రమే. రాష్ట్ర విభజన జరిగి అప్పులు నెత్తిన బెట్టి అన్యాయంగా ఆంధ్రులను చేసిన అవేమి లెక్క చేయక అలసి పోకుండా అకుంఠిత దీక్షతో ముందుకు సాగి ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించి అత్యంత భారీ ప్రాజెక్ట్ ను అతి తక్కువ కాలంలో దాదాపు 75శాతం పనులు పూర్తి చేసే విదంగా అడుగులు వేశారు ఆనాటి,నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అనుకోని రీతిలో ఆంధ్రా ప్రజలు ఆయన్ను ప్రక్కన బెట్టారు.ఇక అంతే రివర్స్ టెండరింగ్ తో మొదలు ఐదు సంవత్సరాలు పోలవరం ప్రాజెక్ట్ నత్తనడకన నడిచింది. ఆంధ్రుల కలలు అవిరిఅయ్యాయి. అనుకున్నట్లే నవ్యాంధ్ర ప్రజలు చంద్రబాబుకి అఖండ మెజారిటీతో పట్టం కట్టారు.పట్టం కట్టిన ప్రజల తాలుకు ఆశయాలకు అనుగుణంగా నాడు ప్రమాణ స్వీకారం చేయకముందే పోలవరం పై పట్టుబట్టి పనులు చేపట్టేందుకు అప్పటి ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ముందుకు సాగారు.నేడు బాధ్యత తీసుకున్న తొలినాళ్ళలోనే పోలవరం ప్రాజెక్ట్ సందర్శన పరిశీలన పనుల తీరు ప్రాజెక్ట్ పురోగతి కోసం పోలవరం పర్యటన అదికూడా సోమవారం అయిన నేడు ముఖ్యమంత్రి పర్యటన చేపట్టడం భవిష్యత్ కార్యాచరణకు నాంది పలకడం ఓ శుభసూచికంగా పరిగణిస్తున్నారు నవ్యాంధ్ర ప్రజలు. ఇక పోలవరం పరుగులు పెడుతుందని పెద్ద ఎత్తున నినాదాలు వినిపిస్తున్నాయి.పాలకుడు ప్రజాకాంక్షకు అనుగుణంగా అడుగులు వేస్తే ఆ ప్రజలు ఎంత సంతసిస్తారో అర్ధమవుతుంది.