వచ్చే అక్టోబర్ నాటికి చెత్తను పూర్తిగా తొలగిస్తాం
రాష్ట్రంలో మరిన్ని వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ లు ఏర్పాటు
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ
పల్నాడు:
వైపీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేయటం తప్ప…చెత్తను తొలగించకుండా అవగాహనరాహిత్యంగా వ్యవహరించిందని మంత్రి నారాయణ ఆరోపించారు..రాష్ట్రంలో గత ఐదేళ్లలో భారీగా చెత్తపేరుకుపోయిందని విమర్శించారాయన..పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం యడ్లపాడు మండలం కొండవీడు లో మంత్రి నారాయణ పర్యటించారు.పట్టణ ఘన వ్యర్ధాలు నిర్వహణ ప్లాంట్ ను స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు,స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరాం తో కలిసి పరిశీలించారు..జిందాల్ సంస్థ ఆధ్వర్యంలో చెత్త నుంచి విద్యుత్ ను తయారుచేస్తున్నారు..చెత్త నిర్వహణ,విద్యుత్ ఉత్పత్తి ఏ విధంగా తయారవుతుందనే వివరాలను ప్లాంట్ మొత్తం తిరిగి అడిగి తెలుసుకున్నారు మంత్రి.ఆ తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.2014-19 మధ్య మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇతర దేశాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి అధ్యయనం చేశామని నారాయణ చెప్పారు..సింగపూర్ లో 4 ప్లాంట్ లు,టోక్యోలో 49 చెత్త ప్లాంట్లున్నా యన్నారు..వాటి మాదిరిగానే ఏపీలో 13 జిల్లాల్లో ప్లాంట్ లు పెట్టాలని గతంలో నిర్ణయించామని వెల్లడించారు..గతంలోనే రాష్ట్రంలోని విశాఖపట్నం,గుంటూరు సమీపంలోని కొండవీడులో రెండు ప్లాంట్లను ప్రారంభించామన్నారు..అయితే గత ప్రభుత్వం అధికారం లో కి వచ్చిన తరువాత చెత్త మిగిలించి , ప్లాంట్ లను వదిలేసిందని విమర్శించారు..వైసీపీ సర్కార్ అవగాహనారాహిత్యంతో మిగిలిన ప్లాంట్ లు నెలకొల్పలేదని అన్నారు…. ఒక్క కొండవీడు ప్లాంట్ కి 3 కార్పొరేషన్లు,6 మున్సిపాలిటీల నుంచి ప్రతి రోజూ 1200 టన్నుల చెత్త వస్తుందని ,ఈ చెత్తను తగులబెట్టి విద్యుత్ ఉత్పత్తి చేసి… బూడిద నుంచి ఇటుకలు తయారు చేస్తారని తెలిపారు..రాష్ట్రంలో ప్రతి రోజూ 6890 టన్నుల ఘన వ్యర్ధాలు మున్సిపాలిటీల నుంచి వస్తున్నాయని… కొండవీడు,విశాఖలో 2169 టన్నుల చెత్త హీట్ అవుతుందని తెలిపారు..త్వరలో నెల్లూరు – గూడూరు,కాకినాడ – రాజమండ్రి మధ్యలో రెండు ప్లాంట్ లు,కడప,కర్నూలు అనంతపురం మధ్య ఒకటి ప్లాన్ చేస్తునట్లు మంత్రి నారాయణ చెప్పారు..గత ప్రభుత్వం చెత్త నిర్వహణ సరిగా చేయకపోవడంతో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త మిగిలిపోయిందన్నారు..ఈ చెత్తలో 45 టన్నులు తొలగించామని…మరో 40 టన్నుల చెత్తను వచ్చే అక్టోబర్ రెండో తేదీ నాటికి మొత్తం తొలగిస్తామన్నారు…టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పి ఉంటే ఇంత పెద్ద ఎత్తున చెత్త ఉండేది కాదన్నారు మంత్రి..గత ప్రభుత్వంలో విధించిన చెత్తపన్నును కూటమి ప్రభుత్వం తొలగించిందని చెప్పారు…అమృత్ పథకం నిధులకు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వలేదని…ఆసియా డెవలప్ మెంట్ బ్యాంకు ఇచ్చే నిధులకు కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో పనులన్నీ మధ్యలోనే నిలిచిపోయాయని విమర్శించారు.మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ లో రోల్ మోడల్ గా ఏపీని నిలబెడదాం- స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరాం.రాష్ట్రంలో చెత్త తొలగింపు,వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు వెనుక జిందాల్ ప్లాంట్ల స్థాపన వెనుక చంద్రబాబు సారథ్యంలో మంత్రి నారాయణ కృషి ఎంతో ఉంది.వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు సమర్ధవంతంగా పనిచేయడానికి కారణం మంత్రి నారాయణ.అయితే గుంటూరు,విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ప్లాంట్లు ప్రజలకు ఎలాంటిఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసారు..గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల చెత్త వదిలేసింది కాకుండా చెత్తపన్ను కూడా వేసిందన్నారు…ఏపీని మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్లో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు..భవిష్యత్తులో ప్రతి జిల్లాలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటుదిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు పట్టాభి.