వీరి అవినీతిని అంత మొందించే వారేలేరా..
బెజవాడ కార్పొరేషన్ కంపు కడగలేరా…
అది అక్రమము అయితే…ఇదెలా సక్రమవుతుంది…
ఇక్కడ ముడుపులు వచ్చి అక్కడ అందలేదా…
ఇదేనా మీ ఉద్యోగ ధర్మం..
దీన్ని నీతి మాలిన చర్యంటారా లేదా…
వీరి అవినీతికి అడ్డుఅదుపు లేకుండా పోయిందా…
మాముల్ల కోసం మున్సిపాలిటీ అధికారులు ఇలా కూడా చేస్తారా…
బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పద్మావతి తీరే వేరయా..
విజయవాడ:ప్రభుత్వాలు మారినా బెజవాడ కార్పొరేషన్ అధికారుల తీరు మాత్రం మారే పరిస్థితి కనిపించడం లేదు.ఏళ్ల తరబడి ఓకే చోట తిష్ట వేసిన అధికారులు తమ స్వలాభం కోసం కాసులకోసం కక్కుర్తి పడి తమ ఉద్యోగ ధర్మాన్ని తుంగలో త్రొక్కి యథేచ్ఛగా జేబులు నింపుకుంటున్నారని చెప్పడానికి బెజవాడ కార్పొరేషన్ పరిధిలోని తాడిగడప లో చోటు చేసుకున్న పరిణామమే పెద్ద ఉదాహరణగా చెప్పవచ్చు.అవినీతి అధికారులపై చర్యలు తీసుకుని ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టకుండా చూడచ్చు.
ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
కార్పొరేషన్ పరిధిలో తాడిగడప ఓ వెంచర్లో బహుల అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి.అయితే అనుమతులు ఉన్నాయా లేవా అని పరిశీలిస్తే అన్ని ఇట్లే ఆ.పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారుల అవినీతి అట్టే బట్టబయలు అవుతుంది.
స్థానిక మనోజ్ నగర్ లో ఓ బడాబాబు వెంచర్ వేసి అమ్మకాలు జరిపారు. ఈ బడాబాబుకు స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కు వైరం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.అయితే ఆ బడాబాబు తన వెంచర్ లో నిర్మాణాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిపిస్తుంటే ఆ ఏరియా బిల్డింగ్ ఇన్స్పెక్టర్ అట్టే అనుమతులుకు సిఫార్సు ఇస్తోంది. అందుకు ఆమ్యామ్యా కూడా ఇచినట్లే తెలుస్తోంది. ఇందులో భాగంగా ఓ బిల్డర్ ఓ బహుళ అంతస్తు నిర్మించాడు.ఏమి జరిగిందో ఎక్కడ పంపకాలలో తేడా వచ్చిందో తెలియదు పెంట్ హౌస్ వేస్తే దానికి కన్నం వేశారు.ఆ కన్నం వేసిన బిల్డింగ్ కు 500 మీటర్ల దూరం కూడా లేదు ఓకే కాంపౌండ్ లో ఇంకో బహుళ అంతస్తు నిర్మాణం చేపట్టి ఆ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ అనుమతి ఆ బడా బాబు అండదండలతో ఆదివారం అట్టహాసంగా ఇక్కడ పెంట్ హౌస్ వేశారు.ఇది మాత్రం సక్రమ ము ఎలా అయిందని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మున్సిపాలిటీ అధికారుల తీరు ,అవినీతిని చూసి ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వం లో అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచి దోచుకున్న అవినీతి అధికారులు ప్రభుత్వాలు మారినా వీరి తీరు మారక పోవడం పై ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికయిన ఉన్నతాధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టి అవినీతి అది కారుల అంతు చూడాలని కార్పొరేషన్ ప్రజలు కోరుతున్నారు.ఈ విషయం పై బీల్డింగ్ ఇన్స్పెక్టర్ ను వివరణ అడిగే ప్రయత్నం చేయగా ఆమె అందుబాటులో లేదు.

