Wednesday, September 3, 2025

Creating liberating content

రాజకీయాలుఏస్కో సాంబా… ఎన్నస్తులైనా..

ఏస్కో సాంబా… ఎన్నస్తులైనా..

గీసుకో సాంబా గోడకు గీతలు..
కట్టుకో సాంబా ఎన్ని అక్రమ కట్టడాలైన..
ఎవరాపేది ఎన్ని అంతస్తులు వేసినా…
అపుతే తోసేయ్ నోట్ల కట్టలు జేబులోకి…
ఐటమ్స్ రాస్తే అడ్డగించేయ్ అడ్డగోలుగా..
కాదంటే కాసులిచ్చేయ్ కామ్ గా..
లేకుంటే లేపేయ్ త్వరగా అంతస్తులు..
ఏలూరు మున్సిపల్ కార్యాలయంలో ఎన్నెన్ని అక్రమాలో..
ఏసీబీ లేదు… ఎవ్వరూ విచారించరూ..
ఇంకెన్నినాళ్ళు ఈ ఏలుబడి..
ఎవరూ లేరా ఏలూరు అవినీతిని ఎదురించడానికి…

ఏలూరు:
సాంబా అంటేనే ఓ సంచలనం. ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో పోలీస్ స్టేషన్లో అల్లరి మూకలను కూర్చోబెట్టి అరేయ్ సాంబా రాస్కో అన్నట్లు ఏలూరు మునిసిపల్ కార్యాలయం పరిధిలో ఎస్కో సాంబా ఎన్నంతస్తులైన గీస్కో సాంబా గోడకు గీతలు ఆపితే కట్టుకో సాంబా ఎన్ని అక్రమ అంతస్తులైన అన్న విదంగా ఆపేదేవరురా మనల్ని అంటూ అక్రమ కట్టడాలకు ఆజ్యం పోస్తుంటే అధికార యంత్రాంగం ఆమ్యామ్య తో సరిపెట్టుకోవడమా లేక అయ్యొ మాకెందుకని అటువైపు చూడకుండా ఉండటంతో ఏలూరు మునిసిపల్ కార్యాలయంలో ఎన్నేన్ని అక్రమాలు రాజ్యమే లుతున్నాయో ఎవరికి అర్థం కావడం లేదని చెప్ప వచ్చు.ఇంతకీ ఏమిటా నిర్మాణాలు అనుకుంటున్నారా… అయితే ఇలా చూడండి…ఏలూరు నగరం అడ్డగోలు నిర్మాణాలకి అడ్డాగా మారింది, “అడిగింది ఇచ్చుకో అడ్డగోలుగా కట్టుకో” ముడుపులు చెల్లిస్తే చాలు నిర్మాణాలకు సెట్ బ్యాకులు వదలకున్నా…డ్రైనేజీలు ఆక్రమించినా… అంతస్తులు పెంచేసినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో చాలామంది నిర్మాణదారులు ఇష్టారాజ్యాంగ నిర్మాణాలు సాగిస్తున్నారు,బృహత్ ప్రణాళిక ప్రకారం రహదారికి పది మీటర్లు వదిలి నిర్మాణం చేపట్టాల్సి ఉన్న సెట్ బ్యాకుల ఊసే లేదు పార్కింగ్కు స్థలం లేకుండా నిర్మాణాలు సాగిస్తున్నారు ఇదంతా ఎక్కడో రహస్యంగా జరుగుతున్న తంతుకాదు బహిరంగ రహదారి పక్కనే చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం ఇంత జరుగుతున్న పట్టించుకోరు రహదారి పక్కన పూరి గుడిసెలు వేసుకుని జీవనం సాగించే వారిపై విరుచుకుపడే పట్టణ ప్రణాళిక అధికారులు కళ్ళ ముందు అక్రమ నిర్మాణాలు చేపడుతున్న డ్రైనేజీలు ఆక్రమించేస్తున్న ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు, కళ్ళ ముందే పార్కింగ్,సెట్ బ్యాకులు ఏర్పాటు చేయకుండా నిర్మాణాలు చివరి దశకు వచ్చిన కూడా అధికారులు పట్టించుకోవడం లేదు, కంటి తుడుపు చర్యగా నిర్మాణదారులకు నోటీసులు ఇచ్చి మామ అనిపిస్తున్నారు.ఈ అక్రమ నిర్మాణాలపై పూర్తిస్థాయి నిఘా లేకపోవడంతో నగరపాలక సంస్థలకు పన్ను రూపంలో రావలసిన ఆదాయం రావడం లేదు, అక్రమ కట్టడాలను తొలి దశలను నిలువరించాల్సిన అధికారులు నిస్తేజంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి అనే విమర్శలు ఉన్నాయి దస్త్రాలు లేకున్నా సరేనగరంలో ఎలాంటి నిర్మాణం చేపట్టాలన్న తొలిత www.apdpms.gov.in వెబ్సైట్లో స్థలం వివరాలు, తాజా ఈసీ, స్థలం ఛాయాచిత్రం,పన్ను రసీదు, నిర్మాణ ప్రణాళిక, యాజమాన్యం వాంగ్మూలం, దస్తావేజులు,ఆటో క్యాట్ ద్వారా రూపొందించిన ప్లాన్ పత్రాలను అప్లోడ్ చేయాలి, ఈ ప్రక్రియలో ఒకటి రెండు అంతస్తులుకు అనుమతులు పొందిన వారు నిబంధనలు ఉల్లంఘించి జి ప్లస్,త్రీ,ఫోర్, నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు బహుళ అంతస్తుభవనాల్లో 1.25 వెడల్పు తగ్గకుండా మెట్లు, జి ప్లస్,ఫోర్ నిర్మాణాలకు అగ్నిమాపక అనుమతులు ఉండాలి జీవో నెంబర్ 541 ప్రకారం 46 అడుగులు వెడల్పు మించిన వీధుల్లోనే బహుళ అంతస్తులు నిర్మాణం చేయాలి. నేల స్వభావాన్ని బట్టి స్ట్రక్చర్ నమూనా అందించి అనుమతులు పొందాలి. సెల్లార్లలో నిర్మాణం నిషేధం. వాహనాల నిలుపుదలకు స్థలం,భవనం చుట్టూ ఖాళీ స్థలం ఉండాలి. ఇలాంటి నిబంధనలన్నీ అధిక శాతం భవనాల్లో పాటించడం లేదు ఇటువంటి నిర్మాణాలు, అవినీతి అధికారుల పట్ల తక్షణమే ఉన్నత అధికారులు స్పందించి అక్రమ నిర్మాణదారుల ఆటలు కట్టించి, నగరపాలక సంస్థకు రావలసిన ఆదాయాన్ని రాబట్టి,నగర అభివృద్ధికి పాటుపడాలని పలువురు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article