జిల్లా సహిత విద్యా సమన్వయకర్త కొమ్మ భాస్కరరావు
చింతూరు
0 నుండి 18 సంవత్సరాల లోపు (ఇంత వరకు) బడిలో పేరు నమోదుకాని దివ్యాంగ చిన్నారుల వివరాలను నమోదు చేపించుకోవాలని, జిల్లా సహిత విద్యా సమన్వయకర్త కొమ్మ భాస్కరరావు చిన్నారుల తల్లిదండ్రులకు పిలుపు నిచ్చారు. బుధవారం మండలంలోని మల్లెతోట గ్రామంలో ప్రత్యేక వసరాల చిన్నారుల గుర్తింపు, తదుపరి బడిలో పేరు నమోదుచేసే సి.డబ్ల్యు.ఎస్.ఎన్ సర్వే జరిగింది. తొలుత గ్రామంలో సెరిబ్రల్ పాల్సీ వైకల్యంతో బాధపడుతున్న ధర్ముల హన్విక వివరాలను నమోదు చేశారు. జిల్లా ఉన్నత స్దాయి అదికారుల ఆదేశాల మేరకు మండలంలో ఐ.ఇ రిసోర్స్ పర్సన్స్ ఆర్.శ్యాంసుందర్ బాబు, కె. జయలక్ష్మిలతో కూడిన బృందం ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఎమైనా సందేహాలు ఉంటే మండల కేంద్రంలోని భవిత సెంటర్ ఐఈ రిసోర్స్ పర్సన్స్ ని సంప్రదించాలని జిల్లా సహిత విద్యా సమన్వయకర్త కొమ్మ భాస్కరరావు ఈ సందర్భంగా సూచించారు.

