Wednesday, November 12, 2025

Creating liberating content

తాజా వార్తలుఏఐతో మోదీ డ్యాన్స్ వీడియో.. బాగా ఆనందించాన‌న్న ప్ర‌ధాని!

ఏఐతో మోదీ డ్యాన్స్ వీడియో.. బాగా ఆనందించాన‌న్న ప్ర‌ధాని!

‘ఎక్స్’లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న మోదీ ఏఐ డ్యాన్స్ వీడియో

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ డ్యాన్స్ చేస్తున్న‌ట్లు ఏఐ టెక్నాల‌జీ సాయంతో ఓ నెటిజ‌న్ వీడియోను రూపొందించి ‘ఎక్స్’ (ట్విట‌ర్‌) లో పోస్టు చేశాడు. ఈ ప‌నికి డిక్టేట‌ర్ న‌న్ను అరెస్టు చేయ‌డ‌ని నాకు తెలుసు. అందుకే ఈ వీడియోను పోస్టు చేస్తున్నాను అని అత‌ను రాసుకొచ్చారు. ఈ వీడియోకు ఇప్ప‌టివ‌ర‌కు 9.8 మిలియ‌న్ల వ్యూస్‌, 1.46 లక్ష‌ల లైక్స్ వ‌చ్చి ప‌డ్డాయి. ఇక ఈ వీడియో చూసిన ప్ర‌ధాని మోదీ స్పందించారు. ‘మీ అంద‌రిలానే నేను కూడా డ్యాన్స్ చూసి ఆనందించా. ఈ పీక్ ఎన్నిక‌ల టైమ్‌లో ఇలాంటి క్రియేటివిటీ నిజంగా ఆనందాన్నిస్తుంది’ అని మోదీ ట్వీట్ చేశారు. కాగా, ఈ వీడియోపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. మోదీని ఫాలో అయ్యే ఓ వ్యక్తి స్పందిస్తూ.. ‘కూలెస్ట్ పీఎం. మీ పాజిటివిటీకి సోర్స్ ఏంటి? సార్’ అని అడిగాడు. ‘మోదీజీ మీరు నిజంగా రాక్‌స్టార్‌లా ఉన్నారు. వారు మిమ్మ‌ల్ని చాలా క్యూట్‌గా ప్ర‌జెంట్ చేశారు’ అని మరో ఫాలోవ‌ర్ కామెంట్ చేశాడు. ఇక ఇదే కోవ‌లో ఇటీవ‌ల టెస్లా సీఈఓ ఎలాన్ మ‌స్క్ ఏఐ డ్యాన్స్‌ వీడియో కూడా బాగా వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article