అత్యవసర చికిత్సలు అందిస్తున్న ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రి వైద్యనిపులు
విద్యార్థులకు ధైర్యం చెప్పిన ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా
సంఘటనలో అస్వస్థతకు గురైన బాలికలను పలకరించిన కాకినాడ జిల్లా కలెక్టర్..
మేలైన వైద్య సౌకర్యం అందించాలని అధికారుల ఆదేశించిన కలెక్టర్.
ఒకరి పరిస్థితి ఆందోళనగా ఉండడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
ప్రభుత్వ ఆసుపత్రిలో కోరుకుంటున్న విద్యార్థులు

సంఘటనపై పూర్తి విచారణ నిర్వహిస్తామన్న కలెక్టర్
ప్రజా భూమి ప్రతినిధి ఏలేశ్వరం.
ఏలేశ్వరం బి ఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో సోమవారం రాత్రి నుండి ముగ్గురు విద్యార్థులకు వాంతులు విరోచనాలు కలగడంతో వెంటనే ప్రిన్సిపాల్ కుడిపూడి చంద్ర శారద సిబ్బందిని అప్రమత్తం చేసి విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం ఉదయం వారితోపాటు మరో 69 మందికి కడుపునొప్పి వాంతులు విరోచనాలు కావడంతో వారందరినీ 108 లో ప్రతి అరగంటకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం వైద్య సాయం అందించడం జరిగింది. వీరిలో మంగళవారం సాయంత్రానికి ఒక విద్యార్థినికి విరోచనాలు కట్టబడక పోవడంతో ఆమెను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి అత్యవసర చికిత్స నిమిత్తం తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ సంఘటనకు సంబంధించి అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలేశ్వరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాంఘిక గురుకుల బాలికల పాఠశాల లో 610 మంది విద్యార్థులు ఆరవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున ముగ్గురు తో ప్రారంభమైన డయేరియా కేసులు గంట గంటకు పెరుగుతూ 72 మందికి సోకింది. దీనితో జిల్లా యంత్రాంగం తో పాటు వైద్య ఆరోగ్య సిబ్బంది జిల్లా కలెక్టర్ శాలిని సన్మోహన్ హుటా హుటీన ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి విద్యార్థినిలకు ధైర్యం చెప్పి వైద్యాధికాలకు మేలైన చికిత్స అందించాలని ఆదేశించారు. అంతకుమునుపే ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రికి చేరుకొని విద్యార్థులకు ధైర్యం చెబుతూ మెరుగైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ ఎమ్మెల్యేలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలకు చేరుకుని పాఠశాలలో ఉన్న మిగతా విద్యార్థులకు ధైర్యం చెబుతూ పాఠశాల ప్రాంగణాన్ని వంటశాల, భోజనశాలను విద్యార్థులు ఉండే వసతి భవనాన్ని సందర్శించారు. పాఠశాలలో ఉన్న ఆర్వో ప్లాంట్ ని కుళాయిలలోని నీటిని స్టోర్ రూమ్ లో ఉన్న ముడి సరుకులను పరిశీలించారు. ఈ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలను కూడా పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సాగిలి సన్మోహన్ మాట్లాడుతూ మాట్లాడుతూ విద్యార్థుల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని స్వల్ప అస్వస్థతకు విద్యార్థులు గురికావడంతో వైద్య సహాయం వేణు వెంటనే అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తిగా విచారణ జరిపించి కారణాలు గుర్తించి తరువాత చర్యలు చేపడతామని తెలిపారు. ఆర్ఓ ప్లాంట్నుంచి వచ్చే మంచి నీటిని, కుళాయిల నుండి వచ్చే నీటిని పరీక్షలకు పంపుతున్నట్లు తెలిపారు. అలాగే వంటశాలలో ఉన్న మూడు సరుకులను కూడా వాడి నమూనాలను తీసుకొని పరీక్షలు నిమిత్తం పంపుతున్నట్లు కలెక్టర్ వివరించారు. ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రి సూపర్నెంట్ శైలజ మాట్లాడుతూ అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి సందర్శించి విద్యార్థులకు మెరుగైన వైద్య సౌకర్యాన్ని అందించడంలో సిబ్బందిని వైద్యాధికారులను అప్రమత్తం చేశారు. ఏలేశ్వరం తాసిల్దార్ వెంకటేశ్వరరావు కూడా తన సిబ్బందితో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిలను పలకరించి వారికి ధైర్యం తెలుపుతూ చురుగైన పాత్ర పోషించారు.అలాగే పాఠశాలను డార్మెంటరీని వంటశాలను షో రూమ్ ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు రోజుల క్రితమే తాను పాఠశాలను డార్మెంటర్ని వంటశాలను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇవ్వడం కూడా జరిగిందని వంటశాలలో అపరిశుభ్ర వాతావరణాన్ని ఉండడంతో తాను దానిపై సిబ్బందికి తగు సూచనలు కూడా చేసినట్లు చెప్పారు. వంటశాలలో సోమవారం రాత్రి విద్యాధినీ లకు వండిన ( ఆహార పదార్ధమైన )డిన్నర్ గా వంకాయ శనగపప్పు క్యాబేజీ మిళితం చేసి వంట చేసి విద్యార్థులకు అందించడంతో అది ఫుడ్ పాయిజన్ అయినట్లు విద్యార్థులను ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే వంటశాలలో ఉన్న ప్లేట్లు కడుక్కునే కుళాయిలలో నీటిని తాగుతుండడం కూడా ఈ ప్రమాదానికి కారణమై ఉండ వచ్చునని వారు పేర్కొన్నారు. ఈ దుర్ఘటనపై జనసేన పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గం ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు తో పాటు సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్, ఏలేశ్వరం నగర్ పంచాయతీ కౌన్సిలర్లు అలమండ చలమయ్య, భోదిరెడ్డి గోపాలకృష్ణ, మూది నారాయణస్వామి, వెంకటరమణ లతోపాటు కూటమి నాయకులు కార్యకర్తలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సహాయం పొందుతున్న బాలికలను పరామర్శించి వారికి ధైర్యం చెబుతూ పాఠశాలలో నెలకొన్న పరిస్థితులపై సమీక్ష జరిపి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజాలకు తగు సూచనలు చేశారు. పాఠశాలలో నెలకొన్న అసౌకర్య పరిస్థితులను ఆమె దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని విద్యార్థినుల తల్లిదండ్రులకు వారు ధైర్యం చెప్పి ఓదార్చారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి విచారణ జరిపిన తర్వాత బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారి ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు.