Sunday, September 14, 2025

Creating liberating content

తాజా వార్తలుఎలక్షన్ కమిషన్ సిట్ అధికారులతో పూర్తిస్థాయిలో ఎంక్వైరీ జరపాలి :ప్రభుత్వ సలహాదారులు నాగార్జునరెడ్డి

ఎలక్షన్ కమిషన్ సిట్ అధికారులతో పూర్తిస్థాయిలో ఎంక్వైరీ జరపాలి :ప్రభుత్వ సలహాదారులు నాగార్జునరెడ్డి

పోరుమామిళ్ల:13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు పగలగొట్టారని వచ్చిన వార్తలపై ఎలక్షన్ కమిషన్ సిట్ అధికారులతో పూర్తిస్థాయి ఎంక్వైరీ జరిపించాలని ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పోరుమామిళ్లలో ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ లో 13వ తేదిన జరిగిన శాసనసభ మరియు పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 9 చోట్ల ఈవీఎంలు పగలగొట్టారని సీఈవో ముఖేష్ కుమార్ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది కానీ ఎక్కడ కూడా ఎవరి పైన కేసు నమోదు చేయలేదని కానీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టారని 20వ తేదీ తర్వాత తెలుగుదేశం నేత నారా లోకేష్ ఖాతాలోకి ఎక్కడి నుండి వచ్చింది అది వారు బయటపెట్టడం పలు అనుమానాలకు తావిస్తుంది ఎందుకంటే. పోలింగ్ బూత్ లో ఎవరు కూడా బయట వ్యక్తులు వీడియో తీటకు అనుమతి లేదు కానీ ఆ వీడియో ఒక సెల్ ఫోన్ ద్వారా ఒక నిమిషం పాటు బయట పెట్టడం జరిగింది. అంతకుముందు బూతులు జరిగింది కానీ ఆ తర్వాత జరిగింది కానీ బయటికి రాలేదు అధికారులు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఈ విషయం ఎక్కడ చూపించలేదు. బూతులో ఉన్న ఏజెంట్లను బయటికి లాగి బయట వారిపై దాడి చేయడం వారు ఆసుపత్రి పాలు కావడం మీడియా ద్వారా బయటికి రావడం జరిగింది. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి 13వ తారీకు నుండి 20 తేది వరకు మాచర్ల లోని ఉన్నారు. అప్పటికి ఆయన పైన కేసు లేదు తర్వాత ఈ వీడియో బయటికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేపై కేసు 13వ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదయిందని సీఈవో ముఖేష్ కుమార్ నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. నిజంగా 13వ తారీఖున ఎమ్మెల్యే పై ఎఫ్ఐఆర్ అయి ఉంటే 20 తేది వరకు అక్కడే ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు అరెస్ట్ చేయలేదు. సీఈవో పైన పలు అనుమానాలకు తావిస్తుంది కావున ఇప్పటికైనా సీఈవో మిగతా ఎనిమిది చోట్ల జరిగిన ఈవీఎంలు పగలగొట్టిన వాటిపై ఆ పని చేసిన వారిపై కేసులను నమోదు చేయాలని ప్రజలందరూ భావిస్తున్నారు. అదే కాకుండా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఎలక్షన్లకు ముందు హైకోర్టును ఆశ్రయించి ఎక్కడైతే బూతులు సక్రమంగా జరగ ఓ అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అందులకు హైకోర్టు కూడా ఎలక్షన్ కమిషన్కు డీజీపీకి చెప్పడం జరిగిందని అదే కాకుండా ఎలక్షన్లకు ముందే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రాత మూలకంగా ఎస్పీకి ఎలక్షన్ కమిషనర్ కి బిజెపికి లెటర్ ఇవ్వడం జరిగిందని కానీ పల్నాడు జిల్లాలో ఎస్పీని మార్చడం వల్ల పోలీస్ అధికారులు కూడా ఇదంతా జరుగుతున్నా కూడా మౌనంగా ఉన్నారని అట్టి వారిపై సిట్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్సీ బీసీ మైనారిటీ లు ఓటు వేయకుండా పోలీసులే అడ్డుకున్న మీడియా బయటకి వచ్చిందని వారిపైన గట్టి చర్య తీసుకోవాలని కోరారు. టిడిపి నేత చదలవాడ ఆసుపత్రిలో మారునాయుధాలు పెట్రోల్ బాంబులు దొరకడం ఆయన పైన కేసు నమోదు చేయకపోవడం చిట్ అధికారుల దృష్టికి తీసుకుపోవడం కూడా జరిగింది. వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఇంటిపై పోలింగ్ రోజున ఒరిస్సా నుండి వచ్చిన అల్లరి ముకలు అక్కడ ఉన్న కార్లను ఫర్నిచర్లను ధ్వంసం చేసి ఎమ్మెల్యే మామ కంజుల కోటిరెడ్డి పై హత్య యత్నానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై పోలీసులే ఎమ్మెల్యే ఇంట్లో లేని సమయంలో తలుపులు పగలగొట్టి లోపలికి పోయి ఫర్నిచర్ కంప్యూటర్స్ సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం జరిగిందని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని. ఈ అంతటికి కారణం తెలుగుదేశం నేత నారా చంద్రబాబు సలహా మేరకు నిమ్మగడ్డ రమేష్, పర్ల రామయ్య ద్వారా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి ద్వారా వారికి నచ్చిన పోలీస్ అధికారులను నియమించడం జరిగింది అందువల్లే ఎక్కడ అధికారులను మార్చారో అక్కడే ఘర్షణలు విధ్వంసం జరిగిందని అదే కాకుండా తిరుపతి. యూనివర్సిటీ దగ్గర జరిగిన ఘర్షణలకు టిడిపి అల్లరి ముకలే కారణమని అన్నారు. కావున ఎలక్షన్ కమిషన్ పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా ఎంక్వయిరీ చేసి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాగార్జున రెడ్డి కోరారు. అలాగే ఈరోజు హైకోర్టులో కూడా ఎమ్మెల్యేలకు రామకృష్ణారెడ్డి, పెద్దారెడ్డి, శ్రీనివాసులరెడ్డిలను హైకోర్టు ఆరో తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని చెప్పడం జరిగిందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article