తాడిపత్రి:కామ్రేడ్ ఏచూరి మరణం కార్మిక వర్గానికి తీరని లోటని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి రంగయ్య పేర్కొన్నారు.
భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) తాడిపత్రి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో తాడిపత్రి మండలంలోని రంగప్ప కాలనీలోని సిపిఐ కార్యాలయంలంలో శుక్రవారం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలువేసి ఘననివాళులు ఆర్పించారు.
ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి టి.రంగయ్య, సిపిఐ మండల కార్యదర్శి ఎ.నాగరంగయ్య, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ
ప్రజా ఉద్యమ నేత కామ్రేడ్ సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12 తేదీ న జన్మించారని, తన విధ్యాభాస్యం హైదరాబాదులో పదవ తరగతి వరకు చదివారని తెలిపారు. ఈ క్రమంలో 1974లో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో చేరి వామపక్ష భావజాలంతో పనిచేస్తూ, తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారని తెలిపారు. ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారని తెలిపారు. 1985లో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యారని, రాజ్యసభ్యుడిగా కార్మిక వర్గ ప్రయోజనాల కోసం చట్టసభలలో గొప్ప పోరాటాన్ని నడిపారని తెలిపారు. మార్క్ లిస్ట్ మేధావిగా ఏచూరి పేరు పొందారని, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి గా పనిచేస్తూ ఆయన గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారన్నారు. కామ్రేడ్ ఏచూరి మరణం కార్మిక వర్గానికి తీరని లోటుయని, ఆయన మరణం బడుగు బలహీనవర్గాల ప్రజలకు, కార్మిక వర్గాలకు తీరనీలోటుగా మేము చింతిస్తూ, ఏచూరికి నివాళులు అర్పించామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కృష్ణమాచారి, ఎర్రప్ప, మద్దిలేటి, లోకేష్, మహిళా నాయకులు రామలక్ష్మమ్మ, మునెమ్మ తదితరులు పాల్గొన్నారు.