రౌతులపూడి:మండలంలోని ములగ పూడి బీసీ బాలుర వసతిగృహం, రౌతులపూడిసమీకృతబాలుర వసతి గృహానికి నియోజకవర్గ దివంగత నేత వరుపుల రాజా 49వ పుట్టినరోజు సందర్భంగా తనయుడు సాయి దర్శిత్ టీవీలు బహుకరించారు. అదేవిధంగా సి.హెచ్.సి లోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. గతంలో రాజా చేసిన సేవలను స్థానిక నాయకులు కొనియాడారు. అనంతరం కేక్ ని కట్ చేసి విద్యార్థులతో ఆనందం పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు, ములగపూడి సర్పంచ్ తమరాల సత్యనారాయణ, ఎంపీపీ గంటిమళ్ల రాజ్యలక్ష్మి, మాజీ ఎంపీపీ ఇటం శెట్టి సూర్య భాస్కర్ బాబు, మాజీ సర్పంచ్ పైల సాంబశివరావు, ఎంపీటీసీయామల సురేష్, పైల రామకృష్ణ, బుద్దాల శ్రీనివాసరావు, తంతపురెడ్డి అప్పారావు,పల్లా సూరిబాబు, చింతకాయల రాజు, పంచాడ బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

