1389 మంది లబ్ధిదారులకు స్థలాల పట్టాలు పంపిణీ చేసిన ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి వరుపుల సుబ్బారావు
రౌతులపూడి:రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాడు ఉండకూడదని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం మండల కేంద్రమైన రౌతులపూడిలో మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల అర్హులైన లబ్ధిదారులకు ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధుల సమక్షంలో ప్రత్తిపాడు వైఎస్సార్ పార్టీ ఇన్చార్జ్ వరుపుల సుబ్బారావు రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలను అందజేశారు. దేశంలో 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదలకు స్థలాలు ఇవ్వడమే కాకుండా వాటి పైన వారికి సర్వహక్కులను కల్పించిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఈ సందర్భంగా వరుకుల సుబ్బారావు అన్నారు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడితే తొమ్మిది కాదు 18 రకాల రత్నాలతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్రంలో అభివృద్ధి పథంలో నడిపించే సత్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా వరుపుల సుబ్బారావు అన్నారు. రౌతులపూడి జెడ్పిటిసి గొల్లు లక్ష్మణమూర్తి, కో ఆప్షన్ మెంబర్ చింతకాయల వీర వెంకట సత్యనారాయణ, సర్పంచ్ కటారి అర్జమ్మ, ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర బాబు, వైయస్సార్ పార్టీ నాయకులు వాసిరెడ్డి జమీలు, గంగవరం సర్పంచ్ సయిపు రెడ్డి వెంకటరమణ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు
