సంథ్య థియేటర్ ఘటన నేపథ్యంలో … తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసే ఆలోచనలో తెలుగు సినీ ప్రముఖులు ఉన్నట్లు నిర్మాత నాగవంశీ వెల్లడించారు. బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డాకు మహారాజ్’ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈక్రమంలో సోమవారం చిత్ర దర్శకుడు బాబీ, నిర్మాత నాగవంశీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ … అమెరికాలో ఉన్న నిర్మాత, ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక సీఎం రేవంత్‌ను కలుస్తామని చెప్పారు. టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై సిఎంతో చర్చిస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సినీ ఇండిస్టీ వెళ్ళిపోతుందా ? అని జర్నలిస్టులు ప్రశ్నించగా, అందుకు నాగవంశీ బదులిస్తూ …. హైదరాబాద్ లో చాలా డబ్బులు పెట్టి ఇల్లు నిర్మించుకున్నానని, తాను ఎపికి ఏలా వెళతానని ప్రశ్నించారు. సినీ పరిశ్రమ ఎక్కడికి వెళ్లబోదని, షూటింగ్స్, ఈవెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉంటాయని స్పష్టం చేశారు. ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కు సినీ ఇండిస్టీ రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో … నాగవంశీ మాట్లాడుతూ… ఏపీ సినీ పరిశ్రమకు అండగా ఉంటుందని పవన్ కల్యాన్ చెప్పారన్నారు. ఎపి, తెలంగాణ విషయంలో సమ ప్రాధాన్యత ఉందని తెలిపారు.