గాజువాక :- పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం 60 వ వార్డ్ పరిధి ఎం ఐ జి కాలనీ పార్క్ మైదానంలో మైక్ టైసన్ బాక్సింగ్ క్లబ్ కోచ్ పోతిన ప్రసాద్ పాత్రుడు, షేక్ అలీ,సహాయ కోచ్ ప్రేమ్ ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 2024 సమ్మర్ కోచింగ్ క్యాంపు లొ భాగంగా క్రీడాకారులకు డైట్ పంపిణి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిధులుగా జై భీమ్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు ఉపాధ్యాయులు గుడాల ఈశ్వర్రావు, కార్యదర్శి మరియు సీనియర్ బాక్సర్ అనపర్తి సైదా సుదర్శన్ మరియు కోస్ట్ గార్డ్ అధికారి ప్రసాదలు పాల్గొని క్రీడాకారులకు, గుడ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, గ్లూకోస్ మరియు కేరింగ్ వాటర్ బాటల్స్ ను పంపిణి చేసారు ఈ సందర్బంగా వీరు మాటలాడుతూ క్రీడలు ఆరోగ్యం తో పాటు ఉత్సహాని ఇస్తుందని దీనిలో మెలకువలు నేర్చుకొని జాతీయ అంతర జాతీయ స్థాయిలో రాణించాలని దీనితోపాటు చదువులో కూడా శ్రద్ధ చూపించి ధ్యానని పెంచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలొ క్లబ్ స్థాపికులు మజ్జి రమేష్,క్లబ్ సహాయకులు జగదీష్, కుమార్, నరేష్ లు పాల్గొన్నారు.