వినుకొండలో రహీద్ హత్య ఘటన రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. ఇది టీడీపీ చేసిన హత్య అని వైసీపీ అధినేత ఆరోపించిన సంగతి తెలిసిందే. నిన్న రషీద్ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… రషీద్ హత్య కేసులో నర్సరావుపేట వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అసలు నిజాలు చెప్పేశారని అన్నారు. ఇది టీడీపీ చేయించిన మర్డర్ అంటూ జగన్ ఆరోపించిన కొద్ది సేపటికే…. ఈ హత్యకు రాజకీయాలకు సంబంధం లేదని… కేవలం గంజాయి మత్తులో చేశాడని… అసలు రషీద్ ను చంపడానికి జిలానీ రాలేదని గోపిరెడ్డి చెప్పారని తెలిపారు. తాను పెంచి పోషించిన గంజాయి మత్తులో చేసిన హత్యను టీడీపీకి అంటకడుతూ జగన్ చిల్లర రాజకీయం చేశారని మండిపడ్డారు.