రాజధాని అమరావతి పరిధిలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సీఆర్డీఏ అధికారులు కూల్చి వేయించారు.. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం ఇది. రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇది నిర్మితమౌతోంది. ఈ భవన నిర్మాణంలో అనేక ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని సీఆర్డీఏ అధికారులు స్పష్టం చేస్తోన్నారు..శనివారం తెల్లవారు జామున సుమారు 5:30 గంటల సమయంలో కూల్చివేత పనులు మొదలయ్యాయి. భారీ బుల్‌డోజర్లు, ప్రొక్లెయినర్లతో కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యగా పోలీసులను సంఘటన స్థలం వద్ద మోహరింపజేశారు.ఇది అక్రమ నిర్మాణం అంటూ ఇటీవలే సీఆర్డీఏ అధికారులు వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వానికి నోటీసులు జారీ చేశారు కూడా. కూల్చివేయాంటూ ఆదేశించారు. ఈ నోటీసులపై శుక్రవారం వైఎస్ఆర్సీపీ నాయకులు హైకోర్టను ఆశ్రయించారు. పిటీషన్లను దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించింది.

