Thursday, February 19, 2026

Creating liberating content

తాజా వార్తలు'ఆకాశ' విమానానికి బాంబు బెదిరింపు.. అహ్మదాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్

‘ఆకాశ’ విమానానికి బాంబు బెదిరింపు.. అహ్మదాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్

విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. తాజాగా, ఆకాశ ఎయిర్‌ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దానిని అహ్మదాబాద్ మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఉదయం 186 మంది ప్రయాణికులతో ఆకాశ ఎయిర్ విమానం క్యూపీ 1719 ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా బాంబు ఉన్నట్టు కెప్టెన్‌‌కు సెక్యూరిటీ అలెర్ట్ వచ్చింది.వెంటనే అప్రమత్తమైన కెప్టెన్ విషయాన్ని అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులకు చేరవేసి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరాడు. అక్కడి నుంచి అనుమతి రాగానే వెంటనే విమానాన్ని మళ్లించి 10.13 గంటలకు సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఆ వెంటనే ప్రయాణికులను ఖాళీ చేయించి తనిఖీలు ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article