14 రోజులపాటు నాలుగు మండలాల్లో సుమారు370 అమ్మవారి ఆలయాల్లో మొక్కులు చెల్లించారు.

జగ్గంపేట :జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ విజయం కోసం వారి కోడలు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ సతీమణి జ్యోతుల లక్ష్మీదేవి జ్యోతుల నెహ్రూ మనవడు జ్యోతులనవీన్ లక్ష్మీదేవి దంపతుల తనయుడు నవ యువ నేత జ్యోతుల అనీష్ నెహ్రూ జగ్గంపేట నియోజకవర్గంలోని అన్ని అమ్మవారిఆలయాలకు మొక్కుకున్నారు. ఎమ్మెల్యేనెహ్రూ అఖండ విజయం సాధించడంతో లక్ష్మీదేవి 14 రోజులపాటు గోకవరం, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి మండలాల్లోని సుమారు 370 అమ్మవారి ఆలయాల్లో అమ్మవారికి సారే చీర బహుకరించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ. సందర్భంగా లక్ష్మిదేవి, అనీష్ నెహ్రూ మాట్లాడుతూ మనందరి అభిమాన నాయకుడు జ్యోతుల నెహ్రూ అఖండ విజయం సాధించడంతో నియోజకవర్గంలోని అన్ని అమ్మవారి ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నామని అందులో భాగంగా 14 రోజులపాటు జరిగిన కార్యక్రమం ఆదివారం రోజు కిర్లంపూడి మండలం తో పూర్తయిందని మొత్తం గోకవరం, గండేపల్లి, గోకవరం, కిర్లంపూడి మండలలోని ప్రతి గ్రామంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని 370 అమ్మవారి ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

