Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలుఅదమరిస్తే పెను ప్రమాదమే…!!

అదమరిస్తే పెను ప్రమాదమే…!!

-నిర్లక్ష్యపు నీడలో విద్యుత్ అధికారులు
-చేతికందేఎత్తులో విద్యుత్ తీగలు
ప్రజాభూమి,హిందూపురం టౌన్
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వెనుక పెను ప్రమాదం దాగి ఉంది. చిన్నపాటి నిర్లక్ష్యం పెను ప్రమాదాన్ని కలిగించే పరిస్థితి నెలకొంది. కేవలం మూడు అడుగుల ఎత్తులో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయడంతో పాటు బయటకు కనిపించేలా విద్యుత్ తీగలు ఏర్పాటు చేశారు. ఆ ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ ఎలాంటి కంచె ఏర్పాటు చేయకపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. నిత్యం వందలాది మంది వాహన చోదకులు, స్కూల్ బస్సులు, స్కూల్ పిల్లలు సైకిల్ మీద తిరిగే రహదారిలో ఈ విద్యుత్ నియంత్రిక ఏర్పాటు చేయడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ విద్యుత్ నియంత్రికకు పక్కనే రహదారి మీద నీటి నిల్వ, అది కాస్తా విద్యుత్ తీగలకి తాకిందో మనిషి మరణం పక్కా. స్కూల్ బస్సు, వాటర్ ట్యాంకర్, ఏ ఇతర వాహనాలు కొద్దిపాటిగా తాకినా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది.హిందూపురం పట్టణంలోని డిబి కాలనీ ఎస్ డి జి ఎస్ డిగ్రీ కళాశాల వెనుక ప్రహరీ గోడ పక్కనున్న రహదారిలో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ దాని విద్యుత్ తీగలు మూడు అడుగుల ఎత్తులో ఉండడం ఒక ఎత్తైతే దాని పక్కనే మట్టి రోడ్డు వర్షం పడిందో ఆ మట్టి రోడ్ లో నీరు నిల్వ ఉంటుంది. వాహనదారులు, చోదకులువెళ్లాల్సిన దుస్థితి. అయితే ఆ ట్రాన్స్ ఫార్మర్ రోడ్డుకు ఆనుకుని ఉండడంతో స్కూల్ పిల్లలు, వృద్ధులు ఏమాత్రం ఏమరపాటు కు గురైయితే ట్రాన్స్ ఫార్మర్ తీగలపై పడాల్సిందే. రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్లినా ట్రాన్స్ ఫార్మర్ తీగలు తగిలే విధంగా ఉన్నాయి. విద్యుత్ అధికారులకు కాలనీవాసులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నిమ్మకు నీరెత్తినట్టు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారని స్థానికుల ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకుంటే ప్రజల ప్రాణాలను రక్షించిన వారవుతారని, విద్యార్థులు సైకిళ్లపై వెళ్లేటప్పుడు కొద్దిగా పట్టు తప్పితే విద్యుత్ నియంత్రికకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలపై జీవచ్ఛవంలా పడాల్సిందే. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ కంచె వేయించాలనిల లేదా ట్రాన్స్ ఫార్మర్ అయినా మరోచోటకు మార్పిస్తే ప్రజల ప్రాణాలను రక్షించిన వారవుతారని కాలనీవాసులు వాపోతున్నారు. ఈ దిశగా విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article