Saturday, November 15, 2025

Creating liberating content

తాజా వార్తలువైద్యం కోసం అమెరికాకు వెళ్లనున్న దలైలామా

వైద్యం కోసం అమెరికాకు వెళ్లనున్న దలైలామా

మోకాలి చికిత్స కోసం దలై లామా అమెరికా వెళ్లనున్నట్టు ఆయన కార్యాలయం ప్రకటన
ఈ పర్యటనలో దలై లామా మీడియా, ఇతర సమావేశాల్లో పాల్గొనరని వెల్లడి
అమెరికా నుంచి తిరిగొచ్చాక అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని ప్రకటన


టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలై లామా ఈ నెలలో అమెరికా వెల్లనున్నారు. మోకాలి చికిత్స కోసం ఆయన అమెరికాకు వెళ్లనున్నట్టు ఆయన కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా సంక్షోభం తరువాత దలై లామా విదేశాలకు వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటన సందర్భంగా ఆయన ఎటువంటి మీడియా సమావేశాలు, కార్యక్రమాల్లో పాల్గొనరు. తిరిగి ధర్మశాలకు తిరిగొచ్చాక యాథావిధిగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 2017 జూన్ లో చివరి సారిగా దలై లామా అమెరికాలో పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన పలు సమావేశాల్లో పాల్గొనడంతో పాటు రోచెస్టర్ లోని మయో క్లినిక్ లో జనరల్ చెకప్ చేయించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article