Wednesday, February 18, 2026

Creating liberating content

తాజా వార్తలుబంగాళాఖాతంలో 'రెమాల్' తుపాను…

బంగాళాఖాతంలో ‘రెమాల్’ తుపాను…

ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయన్న ఐఎండీ

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి తుపానుగా మారనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. తుపానుగా మారితే దీనిని ‘రెమాల్’ అని పిలవనున్నారు. కాగా, ఈ నెల 25వ తేదీ రాత్రికి తీవ్ర తుపానుగా బలపడి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఈ నెల 25, 26 తేదీల్లో ఉత్తర ఒడిశా తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 26, 27 తేదీల్లో పశ్చిమ బెంగాల్ లోని తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ నెల 28 వరకు బెంగాల్ లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో, ఏపీపై ఈ తుపాను ప్రభావం ఏమాత్రం ఉండదని, రాష్ట్రంలో ఎండలు మండిపోతాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఏపీలో వేడి గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article