విజయవాడ: ఈనెల 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్.చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభలో ప్రమాణ స్వీకారం చేయనున్న నేపధ్యంలో శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షిస్తున్నారు.
ఈసమావేశంలో సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ ఈప్రమాణ స్వీకారానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, రాష్ట్ర గవర్నర్ సహా పలువురు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారని కావున కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.అలాగే విస్తృత మైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈసమావేశంలో డిజిపి హరీశ్ కుమార్ గుప్త, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శులు యం.రవిచంద్ర,శశి భూషణ్ కుమార్,అదనపు డిజిపి ఎస్.బాగ్చి,టిఆర్ అండ్బి కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న, పౌరసరఫరాలు,ఉద్యానవన శాఖల కమీషనర్లు అరుణ్ కుమార్,శ్రీధర్,సిఆర్డిఏ కమీషనర్ వివేక్ యాదవ్,ఎపి జెన్కో సిఎండి చక్రధర్ బాబు, ఏలూరు రేంజ్ డిఐజి అశోక్ కుమార్,కృష్ణా,ఎన్టిఆర్ జిల్లాల కలెక్టర్లు డికె బాలాజీ,డిల్లీ రావు,విజయవాడ పోలీస్ కమీషనర్ పిహెచ్ డి రామకృష్ణ, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్, ఎన్టిఆర్ జిల్లా జెసి సంపత్ కుమార్,గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.