Friday, September 12, 2025

Creating liberating content

టాప్ న్యూస్చంద్రబాబు నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది: కలెక్టర్ల సమావేశంలో పవన్

చంద్రబాబు నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది: కలెక్టర్ల సమావేశంలో పవన్

అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు గురువని, ఆయన నుంచి తనలాంటి వారు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు పనిచేవారు సరిగా లేకపోతే ఆ వ్యవస్థ పనిచేయదని పవన్ పేర్కొన్నారు. బలహీనమైన రాజ్యాంగం ఉన్నా ప్రజల కోసం పనిచేసే వారు ఉంటే ఆ వ్యవస్థ బాగా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. నేర్చుకోవాలనుకునే తపన ఉన్న తనలాంటి వారందం కలిసి వ్యవస్థలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. చంద్రబాబు విజన్‌ను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. విభజన వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డామని, అవమానాలు ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. సీఎం చెబుతున్న స్కిల్ సెన్సెస్‌కు సలహాలు, సూచనలు అవసరమని వివరించారు.
రాష్ట్రం వికసిస్తేనే భారత్ సూపర్ పవర్
97 శాతం స్ట్రైక్ రేట్‌తో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్న జనసేనాని.. ఈసారి అధికారంలోకి రాకపోయినా ప్రజాస్వామ్యంలో నిలబడి వ్యవస్థను బలోపేతం చేయాలని అనుకున్నట్టు చెప్పారు. తమది బాధ్యతాయుత ప్రభుత్వమని పేర్కొన్నారు. ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో చెప్పేందుకు గత ఐదేళ్లలో రాష్ట్రం ఉదాహరణగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో ఒకే రోజు 13,326 గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి తీర్మానాలు చేశామని, గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. పిఠాపురంలో లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌ను పైలట్ జెక్టుగా చేపడుతున్నట్టు పవన్ తెలిపారు. 2047 నాటికి భారత్ సూపర్ పవర్ కావాలంటే రాష్ట్రం వికసిత ఆంధ్రప్రదేశ్ కావాల్సిన అవసరం ఉందని పవన్ నొక్కి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article