జీలుగుమిల్లి
కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రక్షణ కోసం పాటుపడుతుందని పోలవరం శాసనసభ్యులు బాలరాజు అన్నారు.
జీలుగుమిల్లి మండలం జగన్నాధపురం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి మీ భూమి – మీ హక్కు రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు, జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవి కుమార్ పాల్గొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా భూమి సంబంధించిన సమస్యలపై రెవెన్యూ సదస్సు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మీ అభివృద్ధి కోసం మీ సంక్షేమ కోసం మీ రక్షణ కోసం కూటమి ప్రభుత్వం శ్రమిస్తోందని తెలియజేశారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండో సంతకంతో ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేయడం జరిగింది అని అన్నారు.
అనంతరం ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జీలుగుమిల్లి మండల అధ్యక్షులు పసుపులేటి రాము, జిల్లా సంయుక్త కార్యదర్శి మద్దు తేజ ,ఇంచార్జ్ డి టి సరిపల్లి సత్యనారాయణ రాజు , చిర్రి శ్రీను, మడివి నారాయణ, కోర్రి అశోక్, జమ్మి గోపి మరియు కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.