నాడు తండ్రి వైఎస్ఆర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
నేడు కొడుకు జగన్ సీఏం హోదాలో ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం
15 లక్షల మందికి తాగునీరు అందించే వెలిగొండ ప్రాజెక్ట్
4.47 లక్షల ఎకరాలకు సాగునీరు కూడా..
వెలిగొండ ప్రాజెక్ట్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. అనంతరం ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని ఎగువ చెర్లోపల్లిలో వెలింగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..అద్భుతమైన ప్రాజెక్ట్ పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందని.. వెలిగొండ ప్రాజెక్టుతో దశాబ్ధాల కల నెరవేరిందని, టన్నెల్‌లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించిందని వ్యాఖ్యానించారు. వెలిగొండ ప్రాజెక్టును సీఎం జగన్ జాతికి అంకితం చేశారు.’మహానేత వైఎస్సార్ వెలిగొండ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. ఆయన కుమారుడిగా ఈ ప్రాజెక్ట్‌ను నేనే పూర్తి చేయడం గర్వంగా ఉంది. ఇది దేవుడి రాసిన స్క్రిప్ట్. ఈ ప్రాజెక్ట్‌తో 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించాం. ఈ టెన్నల్ వల్ల ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది. వెలిగొండ ప్రాజెక్ట్‌తో నాలుగు లక్షల 47 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.’ అని పేర్కొన్నారు.ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కనిగిరి, యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, ఉదయగిరి నియోజకవర్గాల్లోని ప్రజలకు ఫ్లోరైడ్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.