ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం చేసిన కృషిని ప్రస్తావిస్తూ, ఆ పరిస్థితులు తన జీవితంలో ఇప్పటివరకు చూడలేదని చెప్పారు. వరద బాధితుల కోసం మంచినీళ్లు అడిగినప్పుడు తాను నీళ్లు పంపించలేని పరిస్థితిని ఎదుర్కొన్నానని, తర్వాత లక్షలాది వాటర్ బాటిళ్లను సేకరించి పంచారని గుర్తు చేసుకున్నారు.విజయవాడలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేసే కార్యక్రమంలో మాట్లాడుతూ, బాధితుల తగిన అవసరాలు తీర్చడానికి తన ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని వివరించారు. అనూహ్యమైన కుండపోత వర్షం మరియు బుడమేరులో భారీ వరదలు కారణంగా ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను అర్ధం చేసుకొని వారికి తక్షణ సాయం అందించామన్నారు.విధి నిర్వహణలో ఉన్న అధికార యంత్రాంగంతో కలిసి చంద్రబాబు స్వయంగా బాధిత ప్రాంతాల్లో తిరుగుతూ, ప్రజలకు భరోసా కల్పించామని చెప్పారు. ప్రధానంగా దాతలు సాయంగా అందించిన విరాళాలు రికార్డు స్థాయిలో ఉండగా, 400 కోట్ల రూపాయల విరాళం సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందిందని ఆయన వెల్లడించారు.వరద సహాయక చర్యల్లో భాగంగా పంచిన సాయం:14 కోట్ల వాటర్ బాటిళ్లు37 లక్షల మిల్క్ బాటిళ్లు47 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు5 లక్షల కోడి గుడ్లు3.50 లక్షల క్యాండిల్స్2.30 లక్షల మ్యాచ్ బాక్సులు1.15 కోట్ల ఆహార ప్యాకెట్లు5 వేల క్వింటాళ్ల కూరగాయలుఅదనంగా, ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది 75 వేల ఇళ్లను, 330 కిలోమీటర్ల మేర రోడ్లను శుభ్రం చేయగా, శానిటేషన్ సిబ్బంది 20 వేల మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించారు.