గాజువాక:
గాజువాకలో మహా కార్మిక ప్రదర్శన పాత గాజువాక జనక్షన్ నుండి కొత్త గాజువాక జరక్షన్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ విజయవంతం అయ్యింది. సిఐటియు జోన్ కార్యదర్శి ఏ.నూకేశ్వరరావు అధ్యక్షా వహించిరి. రాష్ట్ర సిఐటియు నాయకులు సి.హెచ్. నర్సింగరావు, జిల్లా సి పి ఐ (ఎం) పార్టీ జిల్లా నాయకులు ఎం. జగ్గు నాయుడు, ఎం. రాంబాబు, కే ఎం. శ్రీను, ఐద్వా నాయకురాలు కే. సంతోషం, జి వి ఎం సి మున్సిపల్ నాయకులు, గొల గాని అప్పారావు, పాల్గొని మాట్లాడుతూ,
దేశవ్యాప్త కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ విధానం రద్దుచేసి, ఉద్యోగ కార్మికుల్ని పర్మినెంట్ చెయ్యాలని, కాలపరిమితి ముగిసిన అన్ని షెడ్యూల్డ్ ఎంప్లాయి మెంట్లు కనీస వేతనాల జీవోలను సవరించాలని. 2021సం.,లో విడుదల చేసిన ఐదు కనీస వేతనాల జీవోలను వెంటనే గెజిట్ చేసి అమలు చెయ్యాలని, కనీస పెన్షన్ రూ;.10,000/- లకు పెంచాలని, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత పథకాన్ని ప్రవేశ పెట్టాలని, అన్ని రకాల ఆహార వస్తువులపై జిఎస్టిని ఉపసంహరించాలని, కేంద్ర స్కీoలకు బడ్జెట్ తగ్గించొద్దు ఆని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వేతనాలు చెల్లించాలని, అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థల వాటాల అమ్మకం, ప్రైవేటుపరం చెయ్యటం ఆపాలని, తదితర డిమాండ్స్ తో మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలపై చేస్తున్న తీరును ఎండగట్టాలని, పెద్ద ఎత్తున కార్మిక వర్గంను చైతన్యం చేసి రాష్ట్ర దేశ ప్రజలను మేల్కొల్పాలని ఈ సమ్మె ఉద్దేశం అని అన్నారు . ఈ సమావేశంలో కే. కిరీటం, కొవిరి అప్పలరాజు, నమ్మి రమణ, గొల్ల రాము, డి. రవణ,మీనాక్షి, గణేష్, నాగరాజు, క్లీన్ ఎన్విరాన్ మెంట్ వర్కర్స్, తదితరులు పాల్గొన్నారు.