Sunday, February 15, 2026

Creating liberating content

సినిమా'సిటాడెల్‌' రెండో ట్రైలర్‌ విడుదల… యాక్షన్‌తో అదరగొట్టిన సమంత

‘సిటాడెల్‌’ రెండో ట్రైలర్‌ విడుదల… యాక్షన్‌తో అదరగొట్టిన సమంత

‘సిటాడెల్‌: హనీ బన్నీ’కి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ ట్రైలర్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వెబ్ సిరీస్ పై భారీగా అంచనాలను పెంచేసింది. తాజాగా రెండో ట్రైలర్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. గతంలో ఎప్పుడూ కనిపించని రీతో సమంతా ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టింది. అమ్మడు యాక్టింగ్ చూసి ఆడియెన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ ముద్దుగుమ్మ స్టంట్స్ చూసి వారెవ్వా అంటున్నారు. కొంత మంది సామ్ ఫ్యాన్స్ అయితే ప్రియాంక చోప్రా చేసిన సిటాడెల్ కంటే ఈ ట్రైలర్ బావుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు సమంత చేసిన యాక్షన్ వెబ్ సిరీస్ లను తలదన్నేలా ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ ఉండబోతుందంటున్నారు అమె అభిమానులు. ఈ వెబ్ సిరీస్ లో హనీగా సమంత, బన్నీగా వరుణ్ ధావన్ అదరగొట్టేశారు. చాలా రోజుల తర్వాత సమంత యాక్షన్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సిరీస్ కోసం ఆమె అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కే కే మీనన్, సిమ్రాన్, సాకిబ్ సలీమ్, సికిందర్ ఖేర్, సోహమ్ మజుందార్, శివన్‌ కిత్ పరిహార్, కష్వీ మజ్ముందర్ ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు డి2ఆర్ ఫిల్మ్స్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్ ను నిర్మించాయి. నవంబర్‌ 7న హిందీ, తెలుగు,తమిళ్‌, కన్నడ, మలయాళంలో ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌ కానుంది. ఇప్పటికే రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో ‘ఫ్యామిలీ మ్యాన్‘ సీజన్ 2లో నటించిన సమంత.. ఇప్పుడు మరోసారి వారితో కలిసి పనిచేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article