Wednesday, November 19, 2025

Creating liberating content

తాజా వార్తలుచిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ మృతి!

చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ మృతి!

అనారోగ్యంతో క‌న్నుమూసిన శిరీష్‌ భరద్వాజ్
చిరంజీవి రెండో కుమార్తె శ్రీజతో శిరీష్‌కు 2007 ప్రేమ వివాహం
ఆ తర్వాత కొన్నేళ్లకు విడిపోయిన జంట‌

మెగాస్టార్‌ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్‌ భరద్వాజ్ అనారోగ్యంతో మృతిచెందారు. గత కొంత కాలంగా లంగ్స్‌ డ్యామేజ్‌తో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం చ‌నిపోనట్లు స‌మాచారం. శిరీష్‌ మృతి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, చిరంజీవి రెండో కుమార్తె శ్రీజను శిరీష్ భరద్వాజ్ 2007 ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్నేళ్లకు వీరిద్దరూ విడిపోయారు. ఈ జంటకు ఓ పాప ఉంది. ఆ తర్వాత శిరీష్‌ రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక శిరీష్‌తో విడిపోయిన అనంతరం హీరో కల్యాణ్‌ దేవ్‌ను శ్రీజ రెండో వివాహం చేసుకుంది. ఈ జంటకు కూడా ఓ పాప ఉంది. ప్రస్తుతం శ్రీజ తన ఇద్దరు కూతుళ్ల‌తో కలిసి చిరంజీవి ఇంట్లోనే ఉంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article