Wednesday, February 18, 2026

Creating liberating content

తాజా వార్తలుచంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏపీ విశిష్ట అతిథిగా రావాలని చిరంజీవికి ఆహ్వానం

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏపీ విశిష్ట అతిథిగా రావాలని చిరంజీవికి ఆహ్వానం

రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి మెగాస్టార్ చిరంజీవి విశిష్ఠ అతిథిగా హాజరు కానున్నారు. టీడీపీ అధినేత రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశిష్ట అతిథిగా హాజరు కావాలని కోరుతూ చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది.చిరంజీవి ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్నారు. అక్కడి నుంచి రేపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లనున్నారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ కూడా హాజరు కానున్నారు. చంద్రబాబు రేపు మధ్యాహ్నం 11.27 గంటలకు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article