చంద్రగిరి:పాకాల మండలం,ఇ- పాలగుట్టపల్లి పంచాయతీ పరిధిలో లక్ష్మీపురం గ్రామానికి ఉన్న 50 ఏళ్లనాటి రహదారి సమస్యకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి శాశ్వత పరిష్కారం చూపారు. ఆదివారం రూ.45 లక్షల నిధులతో లక్ష్మీపురం గ్రామానికి వేసిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవ వేడుకలు తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. అంతకుముందు కొమ్మిరెడ్డి గారి పల్లి, వరదప్పరాజ పేట, వెంకటరామాపురం మీదుగా ఇ – పాలగుట్ట పల్లి పంచాయతీ వరకు బైక్ ర్యాలీతో లక్ష్మీపురం గ్రామ యువత చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. 900 మీటర్ల నిర్మాణం జరిగిన సీసీ రోడ్డు పై గ్రామ ప్రజలతో కలిసి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నడిచారు. స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జై చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అంటూ నినాదాలతో యువత హోరెత్తించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రసంగించారు. ఇ – పాలగుట్ట పల్లి పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాలువలు, సీసీ రోడ్లు నిర్మాణానికి రూ.70 లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. మా వంతు బాధ్యతను నిర్వర్తించాం.. మీ బాధ్యతగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఆదరించి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల కొనసాగింపునకు సంపూర్ణ సహకారం అందించాలని తెలియజేశారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజా సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి కొనసాగితేనే ప్రజలు మెరుగైన జీవితాన్ని అనుభవిస్తారని వివరించారు. సీఎం జగనన్న నాయకత్వంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి సేవా కార్యక్రమాలకు సంకల్పించారని తెలియజేశారు. కరోనా కాలంలో ప్రజలకు అండగా నిలిచిన అంశాలను, వరదల సమయంలో భరోసా కల్పించిన సంఘటనలు, పండుగల సందర్బాలలో కానుకలు అందజేయడం, యువతకు క్రీడా పోటీలు నిర్వహించి ప్రోత్సహించడం, పెళ్లి కానుకలు అందజేయడం వంటివి ఒక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంతం అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ లోకనాదం, జెడ్పీటీసీ నంగా పద్మజ రెడ్డి, పార్టీ కన్వీనర్ నంగా నరేష్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ మునీశ్వర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ లింగయ్య, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ విక్రమ్ రెడ్డి, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రఘుపతి, వైస్ ఎంపీపీ రహీం, నాగూర్ బి, డివిజన్ అధ్యక్షులు మోగరాల హరిప్రసాద్ రెడ్డి, కపిలేశ్వర్ రెడ్డి, భాస్కర్ నాయుడు, సర్పంచ్ శిద్దారెడ్డి,మాజీ సర్పంచులు నాగరాజ నాయుడు, చంద్ర, సీనియర్ నాయకులు రామలింగారెడ్డి, కేశవులు రెడ్డి, హేమంత్ రెడ్డి, తులసిరామ్ రెడ్డి,సురేంద్ర, మౌనిష్ రెడ్డి, శివ,శివారెడ్డి, గురవారెడ్డి, జ్యోతి రెడ్డి, భరత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.