Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుసీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన హరిరామజోగయ్య కుమారుడు

సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన హరిరామజోగయ్య కుమారుడు

తాడేపల్లిగూడెం సభలో జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, కాపు సామాజిక వర్గ పెద్ద చేగొండి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ నేడు వైసీపీలో చేరారు. సూర్యప్రకాశ్ ఇప్పటివరకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో, ఆయన జనసేనకు గుడ్ బై చెప్పి నేడు వైసీపీ తీర్థం పుచుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో చేగొండి సూర్యప్రకాశ్ కు సీఎం జగన్ వైసీపీ కండువా కప్పారు. పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article