Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుకుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్‌ ఉన్నారు.సంప్రదాయ వస్త్ర ధారణతో చంద్రబాబు,లోకేష్,దేవాన్ష్ శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆలయ మహాద్వారం వద్ద చంద్రబాబుకి ఇస్తికఫాల్ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని చంద్రబాబు దర్శించుకున్నారు.అంతకుముందు ఆయనకు టీటీడి జేఈవో గౌతమి, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.కాగా, సీఎంను చూసేందుకు వైకుంఠం క్యూక్లాంపెక్స్‌ వద్దకు తెదేపా కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article