Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుతప్పకుండా కలిసి పనిచేద్దాం …ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ కు చంద్రబాబు స్పందన

తప్పకుండా కలిసి పనిచేద్దాం …ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ కు చంద్రబాబు స్పందన

నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ఘన నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కలలు కన్న సమాజం కోసం కలిసి పనిచేస్తాం అంటూ ట్వీట్ చేశారు. ప్రధాని ట్వీట్ పై టీడీపీ అధినేత, ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేత చంద్రబాబు స్పందించారు. “నిజంగా… ఎన్టీఆర్ గారు తెర మీద, తెర వెలుపల ఓ లెజెండ్. ప్రజా కేంద్రక పాలన, సంక్షేమం కోసం పోరాడేందుకు ఆయన ఓ ప్రేరణగా నిలుస్తారు. ఆయన నిస్వార్థ ప్రజాసేవ స్ఫూర్తి చిరస్థాయిగా మన హృదయాల్లో ఉండిపోతుంది, మన మార్గాలను ప్రకాశవంతం చేస్తుంది. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం మనం తప్పకుండా కలిసి పనిచేద్దాం మోదీ గారూ!” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article