Wednesday, January 8, 2025

Creating liberating content

టాప్ న్యూస్నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియల్లో చంద్రబాబు

నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియల్లో చంద్రబాబు

నారారామ్మూర్తినాయుడు కి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, నారా లోకేష్, రాష్ట్రమంత్రులుఎమ్మెల్యేలు,ఎంపీలు,టిడిపినాయకులు..


చంద్రగిరి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు శుభస్తీకరణ, సంస్మరణ కార్యక్రమాలు నారావారిపల్లి లో గురువారం ఘనంగా జరిగాయి. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు స్వగృహం నుండి పెద్దకర్మ కార్యక్రమాలు నిర్వహించేందుకు నారా రోహిత్ నారా గిరీస్ లు రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలతో రామ్మూర్తి నాయుడు తనయుడు పూజ సామాగ్రి ని రామ్మూర్తి నాయుడు స్మారక ఘాటు ( సమాధి) వద్దకు దాయాదులతో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు వెళ్లారు. అక్కడ బ్రాహ్మణులచే పెద్దకర్మ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం నారా రామ్మూర్తి నాయుడు స్మారక ఘాట్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారా

రామ్మూర్తి నాయుడి చిత్రపటానికి పలువురు నివాళులు..
సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు శుభస్తీకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, వివిధ రాజకీయ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో హాజరైనారు. నారావారిపల్లెలో నారా రామ్మూర్తి నాయుడు చిత్రపటాన్ని ఏర్పాటుచేసి సంస్మరణ సభను ఏర్పాటు చేశారు. ఈ సంస్మరణ సభలో నారా రామ్మూర్తి నాయుడు చిత్రపటాన్ని వివిధ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. స్వర్గీయ నారా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, వలగపూడి అనిత, సవిత, బీసీ జనార్దన్, మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు, మాజీమంత్రి, దేవినేని ఉమా., బుద్దా వెంకన్న. ఎన్ అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, డాక్టర్ మురళీమోహన్, డాక్టర్ థామస్, ఆదిమూలం, బొజ్జల సుధీర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, గురుజాల జగన్మోహన్ నాయుడు, గాలి భాను ప్రకాష్, కంచర్ల శ్రీకాంత్, వైసీపీ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం,, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి,జిల్లా అధికారులు, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు.
నారావారిపల్లెలో గట్టి బందోబస్తు..
సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు పెద్దకర్మ క్రియల సందర్భంగా అనంతపురం రేంజ్ డిఐజి షిమూషి బాజ్ పేయ్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు నేతిత్వంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏ రంగంపేట— నారావారిపల్లికి మధ్యలో చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేసి విఐపి ల వాహనాలను మాత్రమే నారావారిపల్లిలోకి అనుమతించారు. మిగిలిన వారిని వాహనాలను చెక్ పోస్ట్ పక్కన ఏర్పాటుచేసిన స్కూటర్, కార్ పార్కింగ్ ల వద్ద వాహనాలను పెట్టించి ప్రజలనునారావారిపల్లిలోకిఅనుమతించారు.
మూడు చోట్ల భోజనం ఏర్పాట్లు..
నారా రామమూర్తి నాయుడు పెద్దకర్మ కార్యక్రమాలకు హాజరైన ప్రజలకు శాఖాహారముతో కూడిన భోజనాలను మూడు ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. వీఐపీలకు ప్రత్యేకంగా భోజనశాలను ఏర్పాటు చేశారు. దీంతో భోజనశాల వద్ద ప్రశాంతంగా కార్యక్రమం ముగిసింది.అనంతరం నారావారిపల్లి సమీపంలోని శేషాపురం శివాలయమును కుటుంబ సభ్యులతో కలిసిముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటల గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లి లోని స్వగృహానికి తిరుగు ప్రయాణం అవుతారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article