నంద్యాల జిల్లా బనగానపల్లెలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్ రెడ్డి అర్ధాంగి ఇందిరమ్మపై దాడి జరగడం తెలిసిందే. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న ఇందిరమ్మపై వైసీపీ నేత కాటసాని రామిరెడ్డి కొడుకు ఓబుల్ రెడ్డి దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. తల్లి వయసున్న మహిళలపై రాళ్లు, కర్రలతో దాడి చేసిన ఈ సంస్కార హీనులను, రౌడీలను మళ్లీ గెలిపించాలా? అని ధ్వజమెత్తారు. ఓటమి భయంతో వైసీపీ సైకోలు రాక్షసుల్లా తయారవుతున్నారని మండిపడ్డారు. ఇంకెన్నాళ్లు?… మరో వారం రోజుల్లో జగన్ రెడ్డి అరాచకాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు.