Friday, November 21, 2025

Creating liberating content

తాజా వార్తలు'జయ జయోస్తు', 'నారసింహో.. ఉగ్రసింహో ' గ్రంథాలపై చంద్రబాబు, పవన్ ఫొటోలు

‘జయ జయోస్తు’, ‘నారసింహో.. ఉగ్రసింహో ‘ గ్రంథాలపై చంద్రబాబు, పవన్ ఫొటోలు

ప్రముఖ రచయిత పురాణపండ చేతిలో రూపుదిద్దుకున్న గ్రంథాలు

ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ‘జ్ఞాన మహా యజ్ఞ కేంద్రం’ సంస్థాపక కార్యదర్శి, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచించిన ‘జయ జయోస్తు’, ‘నారసింహో.. ఉగ్రసింహో’ గ్రంథాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోలు ముద్రించనున్నారు. ఇటీవల విజయవాడలో పురాణపండతో సమావేశమైన కృష్ణా జిల్లా టీడీపీ నేతలు ఈ మేరకు సూచించినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబునాయుడు సమర్థవంతమైన పాలన అందించాలని కోరుకుంటూ కిమ్స్ ఆసుపత్రి చైర్మన్, మాజీ శాసనసభ్యుడు బొల్లినేని కృష్ణయ్య పైన పేర్కొన్న రెండు మహత్తర గ్రంథాలను బెజవాడ కనకదుర్గమ్మ చెంతన ఉంచి, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుతో ఆవిష్కరింపజేశారు. పురాణపండ సంకలనంలో రూపుదిద్దుకున్న ఈ గ్రంథాలు వేలాదిమంది భక్తులను ఆకర్షిస్తున్నాయి.
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, బీజేపీ, టీడీపీ, జనసేన ముఖ్యనేతలు ఈ రెండు గ్రంథాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం 25 వేల ప్రతులు సిద్ధం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article