స్థానిక బి.జె.ఆర్ కళాశాలలో తెలంగాణ భాష దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. కాళోజి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి, తెలుగులో మాత్రమే ఉన్న అరుదైన ప్రక్రియ అయిన అవధానం పై కార్యక్రమ నిర్వహణ జరిగింది. తెలుగులో అష్టావధానం కార్యక్రమాన్ని శతావధాని అయితగోని వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ డాక్టర్ విజయ్ కుమార్ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆచార్య వి.కిషన్ రావు ,పూర్వ రిజిస్టర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్ గారు విచ్చేశారు. డాక్టర్ అవధాన సంచాలకులు డాక్టర్ ఎన్. దీపిక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి 8 మంది పృచ్చకుల పాత్ర పోషించారు. వారిలో ఒకటి
నిషిద్ధాక్షరి: డాక్టర్ గౌరవరాజు సతీష్ కుమార్

సమస్య :సివి లక్ష్మీనారాయణ
దత్తపది: డాక్టర్ ఎం. రామలక్ష్మి
వ్యస్తాక్షరి: డాక్టర్ జే. గంగాధర్
వర్ణన: డాక్టర్ ఆర్. శ్రీనివాస్ అంత్యాక్షరి: డాక్టర్ ఎన్. దీపిక
ఆశువు: ఆచార్య జి. అరుణకుమారి అప్రస్తుతం: ఆచార్య పగడాల చంద్రశేఖర్ వ్యవహరించారు. తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా కళాశాలలో వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించారు .వారిలో గెలుపొందిన వారికి శ్రీ పండరీనాథ్ ఫౌండేషన్ అధ్యక్షులు సోడగం సరస్వతి గారు మొదటి బహుమతి 500 రూపాయలు రెండో బహుమతి 400 రూపాయలు మూడో బహుమతి 300 రూపాయలు చొప్పున విద్యార్థులకు అందజేశారు.

