ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీని కోర్టు పొడిగించింది. జులై 3 వరకు కస్టడీని పొడిగిస్తూ సోమవారం రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదివారంతో కవిత కస్టడీ ముగియడంతో సోమవారం ఆమెను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. భారీ భద్రత నడుమ కవితను కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు హాలులో ఉన్న మీడియా ప్రతినిధులను చూస్తూ ఎమ్మెల్సీ కవిత.. జై తెలంగాణ, జై భారత్ అని నినాదం చేస్తూ కోర్టు లోపలికి వెళ్లారు.

