ముదిగుబ్బ :ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ జన్మదినం పురస్కరించుకొని ఆయన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ముదిగుబ్బ బాలికల ఉన్నత పాఠశాల నందు పరిటాల రవీంద్ర మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదాన శిధిరం నిర్వహించారు. కదిరి ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి డాక్టర్ శ్రీవాణి, టెక్నీషియన్లు జాన్ వెస్లీ, పిఎండి ఇస్మాయిల్, అరుణ యాదవ్, స్వర్ణలత, స్టాఫ్ నర్స్ సుధా లు సుమారు 71 మందితో రక్తం సేకరించారు. అదేవిధంగా బత్తలపల్లిలో ఆర్కే ఫంక్షన్ హాల్ నందు 200 మంది పరిటాల రవీంద్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తం అందజేశారు. ముదిగుబ్బ రక్తదాన శిబిరానికి మండల వ్యాప్తంగా పలు గ్రామాల నుండి హాజరై రక్తదానం చేశారు. ఈకార్యక్రమం తుమ్మల మనోహర్, రమేష్ బాబుల ఆధ్వర్యంలో నిర్వహించగా నాయకులు అశ్వర్థరెడ్డి, గోపాల్ రెడ్డి, రాధమ్మ, సూరి, నామవినోద్ కుమార్, ముత్తులూరు వెంకటేష్, గుర్తి నంద, డిష్ రామంజి, తుమ్మలసీన వాటర్ ఆనంద్, చరణ్, మీసేవ సురేంద్ర, కణంరామకృష్ణ, బాసినేని హేమేంద్ర, సోమల నాగార్జున, వెలుగు నరసింహులు తదితరులు పాల్గొన్నారు.