నందమూరి బాలకృష్ణ తన రాజకీయ, సినిమా జీవితాలను సమతుల్యం చేస్తూ, ఎప్పుడూ బిజీగా ఉంటారని అందరికీ తెలుసు. హిందూపురం నుండి వరుసగా మూడోసారి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య, తాజాగా హిందూపురంలో సుడిగాలి పర్యటన చేశారు.ఈ పర్యటనలో భాగంగా, బాలకృష్ణ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా హిందూపురంలో కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. బాలయ్య తన స్టైల్లోనే ఈ కార్యక్రమంలో పాల్గొని, బస్సు స్టీరింగ్ పట్టుకొని కొద్దిదూరం డ్రైవ్ చేశారు.ఇది చూసిన స్థానికులు, అధికార యంత్రాంగం, తెలుగు తమ్ముళ్లు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. బాలయ్య బస్సు నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొత్త బస్సులు రావడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత కూడా పాల్గొన్నారు.

