కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై అరెస్ట్ అయిన కేసులో తాజాగా తీవ్ర ఆరోపణలు వెలుగుచూశాయి. ఒక సామాజిక కార్యకర్తపై ఆయన అత్యాచారానికి పాల్పడ్డారని, ఈ మేరకు పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బెంగళూరు కేంద్ర కారాగారంలో ఉన్న మునిరత్నకు, ఈ అత్యాచారం కేసు మరింత చిక్కులను సృష్టించింది.బాధితురాలు తన ఫిర్యాదులో మునిరత్న తరచూ ఫోన్లు చేస్తూ సాన్నిహిత్యం పెంచుకున్నారని, ఆ తర్వాత ముత్యాలనగర్‌లోని ఓ గోడౌన్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశారని పేర్కొన్నారు. అంతేకాక, ఈ సంఘటనను రికార్డు చేసి, వీడియోను బయట పెడతానని బెదిరించారని కూడా ఆరోపించారు. హనీట్రాప్‌కు కూడా ఆమెను ఉపయోగించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు.మునిరత్న బెయిలు పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. కోర్టు బెయిలు మంజూరు చేసినా, జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే పోలీసులు రేప్ కేసులో ఆయనను అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు.