బిజెపి నాయకులు డాక్టర్ ఏలూరి శ్రీరామచంద్రారెడ్డి
మార్కాపురం
మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి మాట్లాడు: దేశం కోసం, ధర్మం కోసం మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇస్తున్న ప్రాధాన్యత గుర్తించి బీజేపీ లో చేరానని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. ఎపి బీజేపీ అధ్యక్షులు దగ్గుపాటి పురంధేశ్వరి సమక్షంలో పార్టీలో చేరిన ఆయన మొదటిసారి మార్కాపురం వచ్చిన సందర్భంగా
ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లా అభివృద్ధికి దూరంగా ఉందని, అనేక పార్టీలకు అవకాశం ఇచ్చిన మన జిల్లా వాసులు, ఒక్కసారి బీజేపీ కి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వెలుగొండ ప్రాజెక్టు, మార్కాపురం ప్రత్యేక జిల్లా వంటి సమస్యల పరిష్కారం కేవలం బీజేపీ తోనే సాధ్యం అవుతుంది అని అన్నారు. కేంద్రం లో మరోసారి మోడీ ప్రభుత్వం వస్తుందని బరోసా ఇచ్చిన ఆయన ఆంద్రప్రదేశ్ లో ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఎపి అభివృద్ధి బీజేపీ లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రజల సహకారం ఉంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో మార్కాపురం నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి పీవీ కృష్ణారావు, నాయకులు కంభం వెంకట రమణ, శ్రీకాంత్, జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ పొట్టి సుబ్బారావు పట్టణ అధ్యక్షులు పైడిమర్రి రామచంద్ర జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మద్దెల లక్ష్మి సైకం శివప్రసాద్ రెడ్డి సత్యనారాయణ రాష్ట్ర ఐటీ సెల్ అధ్యక్షుడు జీవీ రెడ్డి పలువురు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు