Wednesday, February 18, 2026

Creating liberating content

తాజా వార్తలుబర్డ్‌ ఫ్లూ – పౌల్ట్రీ ఉత్పత్తుల అమ్మకం.. దిగుమతిపై నిషేధం

బర్డ్‌ ఫ్లూ – పౌల్ట్రీ ఉత్పత్తుల అమ్మకం.. దిగుమతిపై నిషేధం

కేరళ : బర్డ్‌ ఫ్లూ కలవరం కేరళను వణికిస్తోంది. మానర్కాడ్‌ ప్రాంతంలోని ప్రభుత్వ ప్రాంతీయ కోళ్ల ఫారంలో బర్డ్‌ ఫ్లూ చాలా వేగంగా వ్యాప్తి చెందినట్లు జిల్లా అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు కోళ్ల ఫారాలు ఉన్న ఒక కి.మీ పరిధిలో ఉన్న పెంపుడు పక్షులను వెంటనే చంపాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని కోడి, బాతు, పిట్ట, ఇతర పక్షుల పౌల్ట్రీ ఉత్పత్తుల విక్రయాలను ప్రభుత్వం ప్రస్తుతం నిషేధించింది. ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైరస్‌ను నిర్వీర్యం చేసేందుకు రసాయనాలు స్ప్రే చేస్తున్నారు. కోళ్ల ఫారం నుంచి 1 నుంచి 10 కి.మీ మేర పరిధిని రెడ్‌ జోన్‌గా ప్రకటించామని అధికారులు పేర్కొన్నారు. కొట్టాయం జిల్లాలో చికెన్‌, బాతు, పిట్ట, ఇతర పక్షుల పౌల్ట్రీ ఉత్పత్తుల అమ్మకం, దిగుమతిపై అధికారులు నిషేధం విధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article