బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి కేసులో బుక్కయ్యాడు. షణ్ముఖ్ అన్నయ్య సంపత్ వినయ్ కోసం పోలీసులు షణ్ముఖ్ ఫ్లాట్ కు వెళ్లారు. ఆ సమయంలో గంజాయి సేవిస్తూ షణ్ముఖ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఏపీకి చెందిన మౌనిక అనే యువతిని సంపత్ ప్రేమించాడు. అయితే, ఆమెను కాకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో, తనను సంపత్ మోసం చేశాడంటూ పోలీసులను బాధితురాలు ఆశ్రయించింది. దీంతో, సంపత్ కోసం పోలీసులు షణ్ముఖ్ ఫ్లాట్ కు వెళ్లారు. ఆ సమయంలో షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. గతంలో కూడా షణ్ముఖ్ హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ అయ్యాడు